SKLM: అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉండాలని ఎచ్చెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ డీపీ నాయుడు సూచించారు. బుధవారం ఆయన ఎచ్చెర్ల మండలం జగన్నాథవలస అంగన్వాడీ కేంద్రంను పరిశీలించారు. ఆయన అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ నిర్వహణ, లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం చుట్టూ పరిశుభ్రంగా ఉండాలన్నారు.