W.G: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వాకా ప్రసాద్ తెలిపారు. ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోనే వోపీ, ఐపీ సేవలతో పాటు మందుల నిల్వ తదితర రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సీహెచ్వో రమేష్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.