KDP: రాబోయే వినాయక చవితి నేపథ్యంలో కడప నగరంలో నిమజ్జనం చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీవో జాన్ ఎర్విన్, ఇతర అధికారులతో కలిసి నిమజ్జనం జరిగే ప్రాంతాలను పరిశీలించారు. వినాయక చవితి పండుగ ప్రారంభం నాటికి నిమజ్జన ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.