కడప 2 టౌన్ సీఐగా జి. సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేస్తున్న నాగార్జునను అధికారులు బదిలీ చేయడంతో నూతన సీఐను నియమించారు. ఈయన గతంలో కడప కమాండ్ కంట్రోల్, ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్‌తో పాటు పలు ప్రాంతాల్లో సీఐగా పని చేశారు. 2 టౌన్ స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు.