VSP: విశాఖ తూర్పు నియోజకవర్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. దీంలో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.