NLR: కొడవలూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ని వెనుక నుంచి టాటా ఎస్ వ్యాన్ ఢీకొట్టింది.ఈ ఘటనలో టాటా ఎస్ వాహనంలోని మాధవరావు, హుస్సేన్ అనే చెన్నైకి చెందిన ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కావలికి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.