E.G: ఈ నెల 21 గురువారం పెరవలి మండలం వైసీపీ సమావేశం నిర్వహిస్తున్నట్లు నిడదవోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక దీపిక పంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పరిశీలకులు గిరిజాల బాబు హాజరవుతారన్నారు.