మెగాస్టార్ చిరంజీవి తన 70వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. చిరుకి AP సీఎం చంద్రబాబు బర్త్ డే విషెష్ చెప్పారు. మూవీ, ప్రజా జీవితంలో, దాతృత్వంలో చిరు అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందంటూ పోస్ట్ పెట్టారు. ఆయనతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.