టీమిండియా స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్పై స్పందించాడు. గతేడాది డిసెంబర్లో అశ్విన్ క్రికెట్కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఒక వీడియోలో రిటైర్మెంట్ తీసుకోవడానికి గల కారణాలను అశ్విన్ వెల్లడించాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం శారీరక, మానసిక అలసట అని పేర్కొన్నాడు.