HYD: తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, కల్లుగీత వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. కల్లుగీత వృత్తిని కాపాడాలని, ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు పేరుతో దాడులు ఆపాలని, బార్ షాపుల్లో 25% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. చనిపోయిన గీత కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.