వనపర్తి మండలం రాజనగరం విశ్వక్సేన గోశాలలో శ్రావణమాస శనివారం అమావాస్య సందర్భంగా 154వ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నామని వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు తెలిపారు. 300 గోవుల మధ్య ఉదయం 9 గంటలకు యాగం మొదలవుతుందన్నారు. భక్తులకు అన్నదాన వితరణ చేస్తామని పెద్ద సంఖ్యలో పాల్గొని మహాలక్ష్మి కృపకు పాత్రులు కావాలని కోరారు.