NRPT: పనుల జాతరలో భాగంగా శుక్రవారం ధన్వాడ మండల కేంద్రంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ శివారెడ్డి నూతన అంగన్వాడి భవనం, పబ్లిక్ టాయిలెట్ నిర్మాణానికి భూమి పూజలు చేశారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఛైర్మన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.