BHPL: మలహర్రావు మండల కేంద్రంలోని తాడిచెర్ల PACS గోదాంను మండల వ్యవసాయ అధికారి, పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా పక్కదారి పట్టిందనే ఆరోపణలపై స్టాక్ పరిశీలించారు. అక్రమ రవాణాను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ ఉన్నవారికే ఎరువులు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.