VSP: షీలానగర్ చోరీ కేసును శుక్రవారం ఉదయం పోలీసులు చేదించారు. నర్సీపట్నానికి చెందిన నాగేశ్వరరావు, నెల్లూరుకు చెందిన రాంబాబు, జ్ఞాన ప్రకాష్ షీలా నగర్లోని నాగమణి ఇంట్లో గత నెల 13న 100 తులాల బంగారం, రూ.13 లక్షలు దోచేశారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి ముగ్గురినీ పట్టుకున్నామని, వీరి నుంచి 72 తులాల బంగారం, రూ. 9 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.