SRD: ఖేడ్ నియోజకవర్గంలోని RTC ప్రయాణికుల సమస్యలపై అభిప్రాయం తెలుసుకునేందుకు రేపు డయల్ యువర్ DM కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు DM మల్లేశం బుధవారం తెలిపారు. రేపు గురువారం ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలను తెలపాలన్నారు. ఫోన్ నెంబర్ 9959223170 కు కాల్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.