KMM: అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటకృష్ణ హెచ్చరించారు. గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు తల్లాడ మండలం కేశ్వాపురం గ్రామం వద్ద ఆంధ్ర నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 లారీలపై కేసు నమోదు చేశారు. వీటి విలువ సుమారు రూ. 2.50 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఆర్గనైజర్ పూర్ణతో సహా 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.