KDP: బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపేట గ్రామానికి చెందిన సాన రవికుమార్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన శ్రావణిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి మానభంగం చేశాడు. ఈ కేసులో ముద్దాయిపై నేరం రుజువు కావడంతో ఈరోజు కడప ఏడవ ఏడీజే కోర్టు జడ్జి రమేష్ కుమార్ ముద్దాయి రవికుమార్‌కు యావజ్జీవ కారాగారశిక్ష, రూ.1,50,000 జరిమానా విధించారు.