NZB: పట్టణంలోని రోటరీ నగర్‌కు చెందిన యువకుడు నోముల రాజేశ్వర్ చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పదో తరగతి తర్వాత ఇంటర్ చదవాలనే ఉద్దేశం లేకపోయినా, ఇంట్లో చదువుపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్వర్ బుధవారం అర్ధరాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానిక నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.