GNTR: పొన్నూరులో నిడుబ్రోలు ఫైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిడుబ్రోలు వైపుకు వెళ్తున్న ట్రాక్టర్ను పొన్నూరుకు వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రక్కు, ఇంజన్ రెండు భాగాలుగా విడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది.