ATP: అనంతపురం మొదటిరోడ్డు శివాలయం సమీపంలో జరిగిన విద్యుత్తు ప్రమాదంలో జేఎల్ఎం వెంగముని మృతి చెందిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా లైన్ మెన్ రామాంజులరెడ్డి, జేఎల్ఎం విశ్వనాథను సస్పెండ్ చేస్తూ ఈఈ రమేష్ ఉత్తర్వులు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఈ, మరో సిబ్బందిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.