KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారాముల వారి జాతరలో బుధవారం రాత్రి జరిగిన అపశృతి చోటు చేసుకుంది. రథయాత్రలో రథం కింద పడిన యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటనే పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడిని శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దుక్క వెంకటేశ్(21)గా గుర్తించారు.