పంజాబ్ చండిగఢ్లోని బీజేపీ కార్యాలయం ఎదుట భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసి ఉంచిన ఓ స్కూటీలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.