ATP: గుత్తి శివారులోని పంట పొలాలకు బుధవారం గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో పొలంలో ఉన్న డ్రిప్పు పైపులు మంటల్లో కాలిపోయాయి. బాదిత రైతులు నాగన్న,షేక్షావలి మాట్లాడుతూ.. పంట పొలాల గేట్లకు గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టడంతో పొలంలో ఉన్న మోటర్ తీగలు, డ్రిప్పు పైపులు మంటల్లో కాలిపోయి రూ.2 లక్షల నష్టం వాటిలిందన్నారు.