కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మహారాష్ట్రలోని బారామతికి చెందిన అక్షయ్, సాన్వికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అయితే, భార్యపై అనుమానంతో నడిరోడ్డుపై ఆమె గొంతు కోశాడు. అనంతరం మృతదేహాన్ని కారుతో తొక్కించి చంపేశాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే అక్షయ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.