E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాతబగ్గానికి చెందిన కొందరు గుడివాడ మినప చేలు తీత కోసం వెళుతుండగా లారీ పైనుంచి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిందపడే సమయంలో సదరు వ్యక్తి నిద్ర మత్తులో ఉన్నట్లు సమాచారం.