TG: హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే కాలేజీలో చదువుతున్న ఆశిష్ తనయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అతను తనని 2024లో కాలేజీలోని ఓ గదిలో అత్యాచారం చేశాడని.. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది.
TG: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. లిఖిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 6 గ్రాముల MDMAను సీజ్ చేశారు. నిందితుడు డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్‌లోని నాగోల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్పోర్ట్స్ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇంటర్ విద్యార్థి విష్ణువర్ధన్ స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఫొటో సెషన్ కోసం నాగోల్‌లో విద్యార్థులు బైక్ రైడ్ నిర్వహించారు. ఇందుకోసం స్పోర్ట్స్ బైక్‌ను విద్యార్థులు అద్దెకు తీసుకున్నారు.
AP: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీతానగరం మండలంలోని బొబ్బిల్లంకలో ఓ వ్యక్తి తన భర్య, అత్తను కత్తితో నరికి చంపాడు. సీతారామరాజు, లత దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత తన తల్లి లక్ష్మి ఇంట్లో ఉంటోంది. అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు.. లత, లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు.
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దుండు మల్కాపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. దీంతో క్షతగాత్రులను ప్రభుత్వం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.
AP: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముంచంగిపుట్టులో నాగేశ్వరరావు అనే వ్యక్తిని దుండగులు గొంతుకోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, కొన్నాళ్లుగా మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.
TG: యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గొల్లెగూడెంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 10 నెలల శిశువు, రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఐశ్వర్య ఉరేసుకుంది. కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది మరణించారు. ప్రతిపక్ష నేత రీక్ మచర్ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు US మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.
AP: ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్.. అదే ఊరిలో ఉన్న యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. తన ప్రియురాలిని వేరే ఊరికి తీసుకెళ్లగా.. తనను పంపించాలని అడిగాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. స్థానికులు గమనించి ప్రదీప్‌ను ఆస్పత్రికి తరలించారు.
AP: ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్.. అదే ఊరిలో ఉన్న యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. తన ప్రియురాలిని వేరే ఊరికి తీసుకెళ్లగా.. తనను పంపించాలని అడిగాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. స్థానికులు గమనించి ప్రదీప్‌ను ఆస్పత్రికి తరలించారు.
AP: తిరుపతిలో టాస్క్ ఫోర్ట్స్ పోలీసులు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు. ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 కోట్ల విలువైన 8 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 195 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు సీజ్ చేశారు.
AP: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతలపూడి మండలం జానంపేట దగ్గర ఓ బైక్ కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ రమ్యతో పాటు ఆమె భర్తను కులం పేరుతో దూషించిన పాముల రాజేష్ అనే వ్యక్తిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెక్కొండ ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ATP: గుత్తి మండల పరిధిలోని జిల్లా సరిహద్దు వద్ద గల జొన్నగిరి గ్రామంలో సోమవారం శ్రీనివాసులు అనే రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యుల గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను DGGI అధికారులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. రూ.13 కోట్ల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్లు తేలింది. ఫినో బ్యాంక్ రూ.840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు సమాచారం. విచారణ చేపట్టిన HYD ఎకనమిక్ అఫెన్స్ కోర్టు రిషి గుప్తాకు 14 రోజుల రిమాండ్ విధించింది.