TG: సికింద్రాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. పైలట్ శిక్షణా సంస్థ విద్యార్థినిపై అదే సంస్థ ఉద్యోగి అత్యాచారం చేశాడు. నిందితుడు కేరళంకు చెందిన నసీముద్దీన్‌గా గుర్తించారు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి 2025 నుంచి పలుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: హైదరాబాద్ హస్తినాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. బైకును, నడిచి వెళ్తున్న మరో యువకుడిని కారు ఢీకొట్టడంతో మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ ECE విద్యార్థులు శివ, సందీప్ మృతిచెందారు. కారు ఢీకొని రోడ్డుపై నడిచి వెళ్తున్న మరో యువకుడు కూడా మృతిచెందాడు. కారు డ్రైవర్ తీరుపై కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: గాజువాకలో యువతి మౌనికని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసిన కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. నిందితుడు రవీంద్రని గాజువాక పోలీసులు 3 రోజులు కష్టడీకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కీలక విషయాలు బయటపడ్డాయి. మౌనికను తన స్నేహితుడి ఇంట్లోనే చంపి ట్రాలీ సూట్ కేసులో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ముక్కలు చేసినట్లు వెల్లడించాడని సమాచారం .
VSP: విశాఖ రైల్వే స్టేషన్‌లో నార్కోటిక్ డాగ్ ‘లైకా’ సహాయంతో 30 కేజీల గంజాయి పట్టుబడింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో సూట్‌కేస్‌లో గంజాయి తీసుకెళ్తున్న వ్యక్తిని లైకా వాసన చూసి గుర్తించింది. పోలీసులను చూసి నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కంచరపాలెం పోలీసులకు అప్పగించారు.
Vsp: గాజువాకలో ప్రియురాలు మౌనికను హత్య చేసిన నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్రను పోలీసులు మంగళవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 29న జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు గాజువాక పోలీసులు కోర్టును ఆశ్రయించగా, నిందితుడికి మూడు రోజుల కస్టడీ మంజూరైంది. ఈ విచారణలో హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలను వెలికితీయనున్నారు.
PPM: సంకాడ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న కడుగుల వాసి ధనుష్ అకస్మాత్తుగా అడ్డువచ్చిన ఆవులను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అయ్యింది. స్థానికులు గమణించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబుల్స్‌లోనే ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
AKP: సబ్బవరం మండలం గొల్లలపాలెం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ స్వీపర్ కొమ్ము దుర్గాలు (65) దుర్మరణం చెందాడు. ఇంటి నుంచి గొల్లల పాలెం పంచాయితీ కార్యాలయానికి బైక్ పై వెనక కూర్చుని వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దుర్గాలు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మధ్యధరా సముద్రంలో 120 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. దీంతో 80 మందికి పైగా గల్లంతైనట్లు UNO వెల్లడించింది. లిబియాలోని తజౌరా నుంచి బయలుదేరిన ఈ పడవ ప్రతికూల వాతావరణం కారణంగా నీరు చేరి సముద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఇటలీ తీర రక్షక దళం 32 మందిని సురక్షితంగా రక్షించింది. గల్లంతైన మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
KNR: అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన వాణి(29)కి దామెర గ్రామానికి చెందిన కుమార్తె వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం వేధింపులు పెరగడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వరంగల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
AP: IPL క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీలను పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలోని ఐలా బజార్‌లో బెట్టింగ్ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4.58 లక్షలు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను DSP అభినందించి, రివార్డ్స్ అందజేశారు.
TG: హైదరాబాదులో డ్రగ్ మాఫియా విస్తరిస్తోంది. దీంతో పోలీసులు నగర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టారు. సనత్ నగర్, చిక్కడపల్లి, ఆదిభట్లలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.64 లక్షలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రధాన నిందితులను పట్టుకున్నారు. వీరు ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
TG: జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో విషాదం నెలకొంది. చంద్రశేఖర్, నవిత ఏకైక కుమారుడు నిషాంత్ (9) గుండెపోటుతో మరణించాడు. శివాలయంలో అన్నదానం జరుగుతుండగా బాలుడు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. 3వ తరగతి చదువుతున్న నిషాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కన్నీరు పెట్టించాయి.
TG: కూకట్‌పల్లి JNTUకి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. JNTU అధికారిక వెబ్‌సైట్‌కు ఆగంతకులు మెయిల్ పంపించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను బయటకు పంపి అధికారులు తనిఖీలు చేపట్టారు.
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన డిజిటల్ అరెస్ట్ మోసం తాజాగా వెలుగు చూసింది. CBI, ED అధికారులమంటూ ఓ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. డ్రగ్స్ కేసులో ఆమె పేరుందని, పాస్‌పోర్ట్ బ్లాక్ చేస్తామని బెదిరిస్తూ ఏకంగా రూ.92.7 లక్షలు కాజేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కర్ణాటకకు చెందిన లింగబలిజ విరూపాక్ష అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
AP: కృష్ణా జిల్లా పెనమలూరులో గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి నుంచి మొత్తం 4 కిలోల గంజాయితో పాటు ఒక గ్రాము ఎండీఎమ్ఏ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే ఈ ఇద్దరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.