TG: హైదరాబాద్ శామీర్‌పేట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్‌పై కారులో ఒక్కసారిగా మంటల చెలరేగి వాహన డ్రైవర్ సజీవదహనమయ్యాడు. మంటలు వచ్చాక అతను అందులోనే చిక్కుకుని బయటపడలేకపోయాడు. ఈ క్రమంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఆదివారం పిచ్చికుక్క దాడిలో నలుగురు గ్రామస్థులు గాయపడ్డారు. గాంధీ సెంటర్ వద్ద వీధుల్లో తిరుగుతూ వచ్చిన కుక్క బిళ్ళ రాజు, పాల యాదగిరి, శేఖర్, రాజేందర్ తదితరులపై దాడి చేసింది. కుక్క దాడిలో గేదెలు కూడా గాయపడ్డాయని గ్రామస్తులు తెలిపారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
GNTR: వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపల్లిపాడు చెరువు వద్ద జూదం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందడంతో, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. వట్టిచెరుకూరు సీఐ రామా నాయక్ సమక్షంలో పోలీసు స్టేషన్ సిబ్బందితో కలిసి టాస్క్ ఫోర్స్ బృందం చర్యలు చేపట్టింది. పాల్గొన్న 5 మందిపై కేసులు నమోదు చేశారు.
AP: మన్యం జిల్లా కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యామ్‌లో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివిని గ్రామానికి చెందిన శరత్, గోవింద్‌నాయుడు, ప్రదీప్ తమ బంధువులతో కలిసి రబ్బర్ డ్యామ్‌లో ఈతకు వెళ్లారు. డ్యామ్‌లో ఓ బాలుడు పడిపోతుండగా.. అతడిని రక్షించేందుకు వెళ్లి ఈ ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
కోనసీమ: మలికిపురం మండలం చింతలమోరిలో సముద్రంలో స్నానానికి దిగి బాలుడు గల్లంతయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన తెన్నేటి మహిమ రాజు(14) ఆదివారం ముగ్గురు స్నేహితులతో కలిసి చింతలమోరి బీచ్‌లో స్నానానికి దిగాడు. కెరటాలకు సముద్రంలోకి కొట్టుకు పోయాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MNCL: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంలో భాగంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మందమర్రి CI శశిధర్ రెడ్డి ఆదివారం తెలిపారు. పట్టుబడిన వారిలో రామకృష్ణాపూర్ కు చెందిన గంగాధరి పృద్వితేజ, మంచిర్యాలకు చెందిన ఎస్.కె. గౌసియా ఉన్నారు. వారి వద్ద నుండి 150 గ్రాముల డ్రై గంజాయి రూ. 1,500, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
SKLM: లగేజ్ ఆటో బోల్తా పడి బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పాతపట్నం మండలం కొరసవాడ రహదారిలో ఆదివారం జరిగింది. చోదకుడి పక్కన కూర్చొని ఉన్న బాలుడు లోపింటి భరత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.
AP: అల్లూరి జిల్లా జీనబాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒక మృతదేహం లభ్యంమవగా.. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: మంగళగిరి- తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని నిడమర్రు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి వైపు నుంచి కురగల్లు దిశగా వెళ్తున్న కారు, రోడ్డును దాటుతున్న ఓ బాలుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడి కాలు విరిగినట్లు సమాచారం. వెంటనే స్థానికులు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
సత్యసాయి: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి సమీపంలో ప్రభుత్వ ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని సమాచారం.
AP: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వెహికల్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడులో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖ నుంచి ఒడిశా వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బయోడీజిల్ బంక్‌లోని డీజిల్ ట్యాంక్ పేలి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. పాలువాయి జంక్షన్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది మంటలు అర్పేందుకు శ్రమిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: నెల్లూరులో రాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. బుచ్చిరెడ్డిపాలెంలో హారన్ కొట్టాడని RTC బస్సు ఆపి డ్రైవర్‌పై దాడికి దిగారు. కారులో ఆరుగురు యువకులు ఉండగా.. ఈ దాడి చేసిన తర్వాత వారంతా పరారయ్యారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
AP: గన్నవరం వద్ద ఓ ప్రైవేట్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై-కోల్‌కతా హైవేపై యూటర్న్ తీసుకుంటున్న లారీని తప్పిస్తుండగా బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు పక్కకు దూసుకెళ్లగా ముందు భాగం దెబ్బతింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ఈ ఘటన జరగ్గా.. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత లారీ డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు.
TG: HYDలో ఓ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. అమీర్‌పేటలోని ఓ స్కూల్ యాజమాన్యం ట్రిప్‌లో భాగంగా విద్యార్థులను Wonderla తీసుకెళ్లారు. ఈ క్రమంలో పిల్లలతో టీచర్లు సరదాగా గేమ్స్ ఆడించారు. అయితే ఆటలు ఆడే క్రమంలో 8వ తరగతి విద్యార్థి సూర్యతేజ కిందపడి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.