MNCL: కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కొట్టే మల్లయ్య వ్యక్తికి చెందిన ఎద్దును అపహరించిన వారిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాంకేతికతను ఉపయోగించి నిందితులు మంథనికి చెందిన సమ్మయ్య, రవిలను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. పశువులను దొంగిలించిన, అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
జమ్మూ కాశ్మీర్లో ED ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు నిర్వహించింది. నార్కో టెర్రరిజం (మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా నిధుల సేకరణ) కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ మీదుగా జమ్మూకాశ్మీర్‌కు నిధులు బదిలీ చేస్తూ, భారత్‌లోని ఉగ్రవాద గ్రూప్‌లకు ఆర్థిక సాయం చేస్తున్న ముఠాపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులు కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి.
జమ్మూ కాశ్మీర్లో ED ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు నిర్వహించింది. నార్కో టెర్రరిజం (మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా నిధుల సేకరణ) కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ మీదుగా జమ్మూకాశ్మీర్‌కు నిధులు బదిలీ చేస్తూ, భారత్‌లోని ఉగ్రవాద గ్రూప్‌లకు ఆర్థిక సాయం చేస్తున్న ముఠాపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులు కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నుంచి మరోసారి సమన్లు అందాయి. బ్యాంకు మోసం, మనీలాండరింగ్ ఆరోపణలపై నవంబర్ 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రూ.17,000 కోట్లకు పైగా నిధుల అక్రమ తరలింపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ విచారించనుంది. ఇటీవల రూ.7,500 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన అనంతరం ఈ సమన్లు జారీ అయ్యాయి.
TG: HYDలోని మలక్‌పేటలో మున్సిపల్ కార్మికులపై కొంతమంది దుండగులు దాడి చేశారు. విధులు నిర్వహిస్తున్న కార్మికులపై దాడి చేసిన వారు బంగ్లా యువకులుగా గుర్తించారు. ఈ దాడిలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KDP: జమ్మలమడుగులోని నాగులకట్ట వీధికి చెందిన మాధవి(32) బీసీ కాలనీకి చెందిన మునగాల రవి(35) వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి అడగడంతో మాధవి అతడిపై కక్ష పెంచుకుని, 2017 జనవరి 19న తన తండ్రి సూర్యనారాయణ రెడ్డి(65)తో కలిసి రవిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశారు. అయితే నేరం నిరూపితమవడంతో కోర్టు మాధవికి, సూర్యనారాయణ రెడ్డికి జీవిత ఖైదు శిక్ష విధించింది.
TPT: రేణిగుంట(M) గాజులమండ్యం పరిధిలోని పాత ఈనాడు కార్యాలయం బ్యాక్ సైడ్ లక్ష్మీ నివాసం ప్రాంతంలో ఓ వ్యక్తి మృదేహం కలకలం రేపింది. డెడ్ బాడీ నోరు, కాళ్లు, చేతులు కట్టేసి బ్లూ కవర్లో చుట్టి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సంపులోకి పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ప్రాథమిక విచారణలో పోలీసులు హత్యగా భావిస్తున్నారు.
TG: జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది అతడిని రక్షించారు. అయితే తన తల్లికి సంబంధించిన కేసు విషయంలో పోలీసులు పట్టించుకోవట్లేదని ఆ యువకుడు ఆరోపించాడు. దానికి నిరసనగా ఇలా చేసినట్లు వెల్లడించాడు.
బెంగళూరులో దారుణం జరిగింది. ఉత్తరహల్లిలోని న్యూ మిల్లెనియమ్ స్కూల్ రోడ్డులో అద్దెకు ఉంటున్న ఓ జంట.. మంగళసూత్రం కోసం ఇంటి ఓనర్‌ను దారుణంగా కొట్టి హత్య చేసింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు ప్రసాద్, అతని భార్య సాక్షి బంగారం కోసం హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నారు.
AP: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద బస్సు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఉదయం 7:45 గంటలకు ఆంధ్రా-ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సు నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని బస్సులో మంటలార్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ వీ.ఐ.పీ రోడ్‌లోని ఆర్చిడ్ వెల్నెస్ & స్పా సెంటర్లో థాయ్ మసాజ్ ముసుగులో వేశ్యవృత్తి నడుస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ దాడిలో బయటపడింది. నిర్వాహకులు పవన్‌కుమార్, శ్రీనివాస్‌లను పట్టుకుని, ఒక కస్టమర్‌తో పాటు 10 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7 వేల నగదు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నరు. యజమానులు అరుణ్ కుమార్, రాహుల్ పరారీలో ఉన్నారు.
E.G: గోకవరం మండలం మల్లవరం గ్రామంలో శ్రీ ఉమా లింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల రెండో తేదీన అర్ధరాత్రి హుండీని గుర్తుతెలియని వ్యక్తి దొంగలించారు. ఆలయ ఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోకవరం ఎస్సై పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన గుర్రం అదిత్య సాయికుమార్ దొంగతనం పాల్పడ్డాడని గుర్తించి అరెస్టు చేశారు.
VZM: బాడంగి మండలంలో మహిళ నదిలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఆనవరం గ్రామానికి చెందిన అంపవల్లి సంతు (31) కార్తీక పౌర్ణమి సందర్భంగా రోజంతా ఉపవాసం ఉంది. సాయంత్రం వేగావతి నదిలో స్నానానికి దిగింది. నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయి కారాడ దగ్గర తేలింది. బంధవులు బాడంగి CHCకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
KMR: భిక్కనూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నరసింహులు (35) మద్యం మత్తులో బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాంటి పని చేయకుండా మద్యం తాగుతూ తిరిగే నరసింహులు, ఇంట్లో డబ్బులు అడగ్గా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
RR: చేవెళ్ల బీజాపూర్- హైదరాబాద్ జాతీయ రహదారిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ వద్ద హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టుని ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అందులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.