KDP: ఎర్రగుంట్ల మండలంలో ఇద్దరు యువకులు ఒక యువతిని ఇబ్బంది పెట్టారు. ఆ కేసులో బుధవారం కోర్టు ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే, ముద్దనూరు మండలం చెర్లోపల్లికి చెందిన గోపాల్, శ్రీధర్ 2023లో ఒక యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిపై కడపలో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం కడప కోర్టు ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా విధించింది.