ASR: అనంతగిరి ఇంఛార్జ్ ఎంపీపీగా ఉర్మ శకుంతల నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎంపీటీసీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి ఎంపీపీ పదవి ఖాళీ అయింది. దీంతో వైస్ ఎంపీపీగా ఉన్న శకుంతలను ఎంపీపీగా నియమించారు. నూతన ఎంపీపీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేవరకు శకుంతల ఆపద్ధర్మ ఎంపీపీగా కొనసాగుతారు.