KKD: స్వచ్ఛతా దివస్ సందర్భంగా కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పర్యావరణ స్వచ్ఛత మరియు ప్రజారోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ.. స్వచ్ఛత అనేది ఒక్క రోజు కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి రోజువారీ బాధ్యత అన్నారు.