KRNL: బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి వచ్చి నందవరంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న అనూర్ మాఘి (30) అనే వ్యక్తి క్రేన్ వద్ద పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా కిందపడి మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ ఘటనలో స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.