అన్నమయ్య: చిన్నమండెం శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలిబండ చెందిన కొంతమంది మహిళా కూలీలు కేశాపురం గ్రామంలో టమాటాలు కోసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా బెస్తపల్లి క్రాస్ వద్ద కడప -బెంగళూరు ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని అగ్రహారం చెక్‌పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తుమ్మలపల్లె గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఎల్వోసీ వెంబడి అడవుల్లో కార్చిచ్చు రాజుకుంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేసేందుకు అమర్చిన మందుపాతరలు పేలినట్లు అధికారులు వెల్లడించారు. ఆరు పేలుళ్లు వినిపించాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.
TG: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. అరోరా పరిశ్రమలో మంటలు చెలరేగడంతో సూరారం గ్రామానికి చెందిన కార్మికుడు అనిల్(43) మృతిచెందినట్లు సమాచారం. బాయిలర్ శుభ్రం చేస్తుండగా సాల్వెంట్ ఫైర్‌తో కార్మికుడు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉ...
కృష్ణా: గన్నవరం మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుసుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
GNTR: పెదకాకాని మండల కేంద్రంలోని బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్ నుంచి గౌడ పాలానికి వెళ్లే రోడ్ దగ్గర ఓ కాలేజ్ బస్సు స్కూటీని ఢీకొంది. స్కూటీ మీద వెళుతున్న దంపతుల్లో.. భార్య పావని(23) మృతి చెందారు. భర్త శివకృష్ణ(25) కాళ్లు విరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
KMR: కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగములు కల్పించేందుకు ఈనెల 22న రోజు ఉ.10 గం.నుంచి మధ్యాహ్నం 2గం. వరకు కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని ఉపాధి కల్పనా అధికారి మధుసూదన్ రావు తెలిపారు. దీనికి గాను 10, ITI, ఇంటర్, డిగ్రీ కలిగి ఉండాలని తెలిపారు. సమాచారం కోసం 6303932430 నెంబర్‌ను సంప్రదించ వచ్చు అని తెల...
KRNL: ఆదోనిలోని బార్ పేటలో ఉన్న పెద్ద వంకలో బుధవారం ఉదయం గుర్తుతెలియని పురుష మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పట్టణంలోని కౌడల్ పేటకు చెందిన నిసార్ అహమ్మద్, సాహెరాబాను దంపతుల కుమారుడు సయ్యద్ గౌస్(28)గా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున టీ తాగడానికి బయటకు వచ్చి తిరిగి ఇంటికి రాలేదని, తన కుమారుడికి మతిస్థిమితం లేదని తల్లి పోలీసుల ఎదుట వాపోయింది.
TPT: చిట్టమూరు మండలంలో సీనియర్ డీలర్ దువ్వూరు కోదండరాం రెడ్డి బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. సుమారు 45 సంవత్సరాల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆయన ప్రజలకు సేవ చేసినట్లు పలువురు తెలిపారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు డీలర్ల సంఘం నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
CTR: కుప్పంలోని పూల మార్కెట్ సమీపంలో ఉన్న ఫెర్టిలైజర్ షాప్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అర్థరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.5లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
KMM: కూసుమంచి మండలం పాతర్లపాడు స్టేజి వద్ద గల భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో బిహార్ రాష్ట్రానికి చెందిన మాధవన్ (20) అనే యువకుడు బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: మద్యం మత్తులో మూత్ర విసర్జనకు వెళ్లి కింద పడి ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోటగల్లికి చెందిన శ్రీనివాస్(40) ఓ పెట్రోల్ బంక్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి మద్యం సేవించి ఐదో టౌన్ పరిధిలోని న్యాల్ కల్కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన మూత్ర విసర్జనకు వెళ్లి మృతి చెందాడు.
CTR: కె.వి.పల్లి మండలం చిన్నగోరంట్లపల్లె వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో చిత్తూరు నుంచి లక్నోకు వెళుతున్న అమర్ రాజా కంపెనీకి చెందినలారీ బ్యాటరీ లోడుతో వెళ్తూ బోల్తా పడింది. డ్రైవర్ సురేంద్ర(42)కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పీలేరు ఎస్సై బాలకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్: మురికి కాల్వలో పడిపోయి వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఐదో ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. నాల్కర్ రోడ్డులో గల డ్రైనేజీలో మూత్ర విసర్జన చేసే సమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఐదో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.