తిరుపతి రూరల్‌లో అద్దె ఇంట్లో ఉండే సంధ్య (29) దొంగతనానికి పాల్పడింది. సాయినగర్‌లో నివసించే మౌనిక.. తన ఇంటి తాళాలను రోజు పూలకుండి వద్ద ఉంచే అలవాటును సంధ్య గమనించింది. ఈ నేపథ్యంలో గత నెల 8న, ఈ నెల 5న ఇంట్లోకి చొరబడి నగలు, నగదు దొంగిలించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రూ.1.40 లక్షల నగదు, రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.