AP: విజయవాడ కొత్తపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగడానికి రూ.10 ఇవ్వలేదని తాతాజీ అనే వ్యక్తిని ఓ బాలుడు విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావమై తాతాజీ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.