AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గుడివాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ఐతవరం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న నలుగురు యువకులు అప్రమత్తమై కారు దిగేశారు. దీంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు ఆర్పారు.