AP: శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిల్లుండలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు వరి పొలానికి నిప్పు పెట్టారు. దీంతో భారీగా మంటలు ఎగిసిపడి 20 ఎకరాలకు వ్యాపించాయి. కొద్దిసేపట్లోనే 20 ఎకరాల వరి అగ్నికి ఆహుతైంది. వరి పంట బుగ్గిపాలవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు.