ASR: కొయ్యూరు మండలం ధర్మవరం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డౌనూరు సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు బిడిజాన అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. అప్పారావు బైక్పై కొయ్యూరు వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అప్పారావును డౌనూరు పీహెచ్సీకి తరలించారు. అనంతరం నర్సీపట్నం తరలించారు.