KKD: పిఠాపురం మండలం పి.దొంతమూరు గ్రామ శివారు పామాయిల్ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 92 కేజీల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. పక్కా ప్రణాళికతో నిఘా పెట్టి గంజాయిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.