• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మహిళల సంక్షేమానికి పెద్దపీట’

KMR: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. బిక్కనూరు మండలం జంగంపల్లిలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ప్రతి మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా చేరి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, సర్పంచ్ శ్రీవాణి ఉన్నారు

March 31, 2026 / 02:01 PM IST

‘టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలి’

VZM: టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. ఆయన స్వగృహంలో మంగళవారం వరుసగా 16, 23, 25, 32, 34, 35, 38, 42, 43, 44, 45, 46 డివిజన్ల సంబంధిత నాయకులతో సమావేశం నిర్వహించారు. బూతు కమిటీలు నందు ఉన్న ఓటర్ల యొక్క చేర్పులు, తొలగింపులు విషయంపై తదితర అంశాలపై బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు.

March 31, 2026 / 02:00 PM IST

అక్రమంగా కర్ణాటక మద్యన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

KRNL: అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని రిమాండ్‌కు పంపినట్లు కోసిగి ఎక్సైజ్ CI భార్గవ్ రెడ్డి ఇవాళ తెలిపారు. కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన హుసేని కందుకూరు నుంచి కడిదొడ్డి క్రాస్ వద్ద అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి నుంచి 6 మద్యం బాక్సులు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

March 31, 2026 / 02:00 PM IST

దారుణం.. వ్యక్తిని మూటకట్టి కాలువలో పడేసిన దుండగులు

విశాఖ పోర్టు పరిధిలో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దారుణంగా దాడి చేసి, మూటలో కట్టి కాలువలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం అటుగా వెళ్తున్న స్థానికులు కాలువలో అనుమానాస్పదంగా ఉన్న ఒక మూటను గమనించారు. అందులో ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని బయటకు తీసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

March 31, 2026 / 02:00 PM IST

జూనియర్ సహాయకులుగా నియామక పత్రాలు అందజేత

SKLM: జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పిరియా విజయ జిల్లా పరిషత్ యాజమాన్యంలో వివిధ ఉన్నత పాఠశాలల్లో రికార్డు సహాయకులుగా పనిచేస్తున్న అర్హత కలిగిన ఐదుగురికి పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు మంగళవారం తన నివాసంలో వారిని జూనియర్ సహాయకులుగా నియామక పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. కష్టపడి పని చేయాలి అని సూచించారు. జడ్పీ సీఈవో సత్యనారాయణ ఉన్నారు.

March 31, 2026 / 02:00 PM IST

వైభవ్ మెరుపులకు కోచ్‌ల రికార్డ్స్ బ్రేక్

CSKపై 5 సిక్సర్లతో 52 రన్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ(RR) తన మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్(IPl 2025), ప్రస్తుత కోచ్ కూమార సంగక్కర రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ద్రవిడ్ 89 IPL మ్యాచుల్లో 28, సంగక్కర 71 మ్యాచుల్లో 27 సిక్సర్లు బాదగా.. వైభవ్ 8 మ్యాచుల్లోనే 29 సార్లు బంతిని బౌండరీ అవతలకు కొట్టాడు. అలాగే 78 మ్యాచుల్లో 29 సిక్సర్లు కొట్టిన సచిన్ రికార్డ్‌నూ సమం చేశాడు

March 31, 2026 / 01:59 PM IST

ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ పూర్తి

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబోలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(LIK). ఏప్రిల్ 10, 2026న ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా రన్‌టైం 2:36 గంటలుగా లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది.  

March 31, 2026 / 01:53 PM IST

శ్రీవారి సేవలో గవర్నర్ అబ్దుల్

AP: గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. TTD ఈవో రవిచంద్ర, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న గవర్నర్‌కు, రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

March 31, 2026 / 01:50 PM IST

శాంతినగర్ ‘నర్సరీ’ని పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్

SRPT: అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో నర్సరీని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల సంరక్షణ, నీటిపారుదల సౌకర్యాలు, మొక్కల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీ నిర్వహణ సక్రమంగా కొనసాగుతుందని అభినందించిన స్పెషల్ ఆఫీసర్, అవసరమైన సదుపాయాలను మరింత మెరుగుపరచాలని తెలిపారు.

March 31, 2026 / 01:49 PM IST

రేపు లోక్‌సభ ముందుకు ఏపీ కీలక బిల్లు

AP: రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానుంది. రేపు లోక్‌సభలో కేంద్ర హోంశాఖ బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో ఈ బిల్లును చేర్చారు. లోక్‌సభ ఆమోదం తర్వాత రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వెళ్లనుంది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో కేంద్రం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

March 31, 2026 / 01:48 PM IST

ఆటో LPG సమస్యపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్‌ లేఖ

TG: రాష్ట్రంలో ఆటో LPG సమస్యపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షకు పైగా LPG ఆటోలు ఉన్నాయని, ఎల్‌పీజీ సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. LPG ఆధారిత ఆటోలు లేక హైదరాబాద్‌లో రవాణా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హార్దీప్ పూరీకి విజ్ఞప్తి చేశారు. అత్యవసరంగా అదనపు LPG సరఫరా చేయాలని కోరారు.

March 31, 2026 / 01:45 PM IST

సిసి రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: రాష్ట్రంలో పల్లెటూర్లను అందంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. పొందూరు మండలం లైదం గ్రామంలో కోటి 34 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిగిరిపల్లి రామ్ మోహన్, టీడీపీ యువత జనరల్ సెక్రటరీ బలగ శంకర్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

March 31, 2026 / 01:43 PM IST

యూట్యూబ్‌లో లీకైన ‘ధురంధర్ 2’..!

యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ పైరసీ ఉచ్చులో చిక్కుకుంది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ చిత్ర పూర్తి వెర్షన్ యూట్యూబ్‌లో లీక్ కావడం కలకలం రేపింది. అప్రమత్తమైన అభిమానులు దర్శకుడు ఆదిత్య ధర్‌కు సమాచారం అందించగా, చిత్రబృందం వెంటనే యూట్యూబ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో యూట్యూబ్ ఆ పైరేటెడ్ లింక్‌ను తక్షణమే తొలగించడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

March 31, 2026 / 01:42 PM IST

పేలుడు ఘటనపై స్పందించిన హోంమంత్రి

AP: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో ఆమె మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయాలపాలైన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని అనిత ఆదేశించారు.

March 31, 2026 / 01:39 PM IST

పోచంపాడ్ పీహెచ్ సీలో వైద్య శిబిరం

NZB: మెండోరా మండలం పోచంపాడ్లో ‘ప్రజా పాలన’లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ మాధురి రాజు, డాక్టర్ రాకేష్ శిబిరాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ నిపుణులు కంటి, ఎముకలు, దంత పరీక్షలు చేశారు. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

March 31, 2026 / 01:38 PM IST