విశాఖ పోర్టు పరిధిలో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దారుణంగా దాడి చేసి, మూటలో కట్టి కాలువలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం అటుగా వెళ్తున్న స్థానికులు కాలువలో అనుమానాస్పదంగా ఉన్న ఒక మూటను గమనించారు. అందులో ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.