• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంజీరా నదిని పరిశీలించిన ఎమ్మెల్యే

MDK: సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు రావాల్సిన నీటిని స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే ప్రభుత్వం అడ్డుకుంటోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్చి 23న 0.3 టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం జీవో జారీ చేసినా, ఇప్పటి వరకు నీటి విడుదల జరగలేదన్నారు. ఈ సందర్భంగా ఆమె నీటి జాప్యంపై నిరసన తెలిపారు.

March 31, 2026 / 06:44 PM IST

ప్రజాభవన్‌లో ‘మహాలక్ష్మి వేడుకలు’

TG: ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణాలు 10 కోట్లు పూర్తి సందర్భంగా జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ‘మహాలక్ష్మి వేడుకలు’ నిర్వహించారు. ఉచిత బస్సు విషయంలో కొందరు మహిళలను అవమానిస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఈ ప్రభుత్వం ఒక్కటి మాత్రమే అమలు చేయలేదని.. పెండింగ్‌లో ఉన్న ఒక్క హామీని త్వరలోనే అమలు చేస్తామని సీతక్క స్పష్టం చేశారు.

March 31, 2026 / 06:40 PM IST

మాజీ జడ్పీటీసీ పార్తివ దేహానికి నివాళులు

కామారెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్, మాచారెడ్డి మాజీ జడ్పిటిసి సభ్యురాలు గ్యార లక్ష్మి మృతి చెందడంతో ఆమె పార్తివ దేహానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్యార లక్ష్మి స్వగ్రామం పోతారం గ్రామంలో వారి కుటుంబానికి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపీ సంతాపం తెలిపారు.

March 31, 2026 / 06:40 PM IST

ఏయూలో ‘HackAP IoT’ హ్యాకథాన్ విజయవంతం

VSP: ఆంధ్రా యూనివర్సిటీ ఆ హబ్, టీఐఈ వైజాగ్ తదితర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘HackAP IoT’ హ్యాకథాన్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 72 బృందాలు పాల్గొనగా, 22 బృందాలు ఫైనల్స్‌కు చేరాయి. గ్రాండ్ ఫినాలేలో విద్యార్థులు తమ ఎల్‌ఓటి ఆధారిత వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు.

March 31, 2026 / 06:40 PM IST

సమస్యల పరిష్కరించాలని అంగన్వాడీలు ఉద్యమం

VZM: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గజపతినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అడ్రస్ చేస్తూ మంగళవారం పోస్ట్ కార్డు ఉద్యమం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా జరిపిన అనంతరం సీడీపీవోకి వినతి పత్రాన్ని అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

March 31, 2026 / 06:40 PM IST

ఎమ్మెల్యేని సత్కరించిన బెటాలియన్ సిబ్బంది

ATP: ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారానికి మార్గం సుగమం చేసిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని 14వ బెటాలియన్ సిబ్బంది మంగళవారం ఘనంగా సన్మానించారు. గత ప్రభుత్వంలో రద్దయిన ప్రయోజనాలను తిరిగి కల్పించేలా కూటమి ప్రభుత్వం ద్వారా ఆమె చేసిన కృషిపై సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

March 31, 2026 / 06:39 PM IST

ముగిసిన మార్కెట్ కమిటీ సభ్యుల స్టడీ టూర్

HNK: కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల స్టడీ టూర్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డులను మార్కెట్ కమిటీ సభ్యులు సందర్శించి కమలాపూర్ మార్కెట్ యార్డు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అక్కడ అధికారులతో చర్చించారు. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు.

March 31, 2026 / 06:39 PM IST

రేపు బాధితుడిని కలవనున్న BRS నేతలు

NGKL: అచ్చంపేట మండలంలోని అంకిరోనిపల్లి సర్పంచ్ సతీష్‌పై జరిగిన దాడి నేపథ్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకుని బాధితుడిని పరామర్శిస్తారు. ఈ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

March 31, 2026 / 06:36 PM IST

సమస్యలపై అంగన్వాడీలు ధర్నా

AKP: నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్స్, 136 సూపర్వైజర్ ప్రమోషన్లు వెంటనే అమలు చేయాలని, ఆయాల ప్రమోషన్ సమస్యలు పరిష్కరించాలన్నారు.

March 31, 2026 / 06:35 PM IST

ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్

నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్​ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. తెలంగాణ డీజీపీ నుంచి వారికి మంగళవారం ఆదేశాలు అందాయి. ప్రమోషన్లు పొందిన వారిలో బన్సీలాల్ (పీసీ, మహిళా పోలీస్​స్టేషన్​ నిజామాబాద్), నాగరాజు (పీసీ, పోలీస్ స్టేషన్ ఆర్మూర్), శ్రావణ్ కుమార్​ (పీసీ నందిపేట్ పోలీస్ స్టేషన్) ఉన్నారు.

March 31, 2026 / 06:35 PM IST

‘అవసరం మేరకు మాత్రమే బుకింగ్ చేసుకోవాలి’

SRCL: వంట గ్యాస్ వినియోగదారులు అవసరం మేరకు మాత్రమే బుకింగ్ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎల్ బుచ్చిబాబు అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ప్రకటన ఓ విడుదల చేశారు. జిల్లాలో తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన పడవద్దన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 25 రోజులకు, రూరల్ పరిధిలో 45 రోజులలోపు గ్యాస్ సిలిండర్లు డెలివరీ అవుతాయన్నారు.

March 31, 2026 / 06:35 PM IST

అగ్నివీర్ నియమకాలకు దరఖాస్తు చేసుకోవాలి: SP

BHPL: భారత సైన్యంలో అగ్నివీర్ నియామకాల కోసం 2027 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా SP సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. ఆసక్తి కలిగిన యువత వెబ్‌సైట్లో ఏప్రిల్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశ సేవ చేయాలని ఎస్పీ సూచించారు.

March 31, 2026 / 06:35 PM IST

‘నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు’

KNR: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని కరీంనగర్ అదనపు డీసీపీ (అడ్మిన్) వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం చల్లూరులో గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసిన కెమెరాలను ఏసీపీ మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. పదిమంది చేసే పనిని ఒక కెమెరా చేస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇవి కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

March 31, 2026 / 06:35 PM IST

‘సహకార చట్టాలపై అవగాహన ఉండాలి’

ASR: సహకార సంఘాల బలోపేతానికి, పారదర్శక పాలనకు సహకార చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలని జిల్లా సహకార అధికారి రామకృష్ణంరాజు అన్నారు. జిల్లా సహకార శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, గిరిజన కో-ఆపరేటివ్ సహకార సంస్థల సిబ్బందికి మంగళవారం పాడేరులో శిక్షణ నిర్వహించారు. చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ రైతులకు, సంఘ సభ్యులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

March 31, 2026 / 06:35 PM IST

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం: MLA

ADB: తెలంగాణ రాష్ట్ర అర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయ్యిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడారు. రోజూ అప్పు చేస్తే కానీ గడవని ఆర్థిక పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు.

March 31, 2026 / 06:34 PM IST