BDK: భద్రాచలం పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ధర్మాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. కుంజా ధర్మా నియామకం పట్ల భద్రాద్రి జిల్లా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, భద్రాచలం డివిజన్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించింది.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా కొలంబియా యూనివర్సిటీలో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే, ఆయన ఎన్నారైలతో, పలు వ్యాపార వర్గాలతో సమావేశం కానున్నారు.
MHBD: మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రైల్వే పరమైన అంశాలను, అవసరాలను వారు KTR తో చర్చించారు. రైల్వే సమస్యలను అసెంబ్లీలో, పార్లమెంట్లో తెలియజేసేలా కృషి చేయాలని కోరారు.
CTR: జిల్లా యాదమరి మండలం జంగాలపల్లిలోని 4.74 ఎకరాల భూమి వినియోగాన్ని మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్ జోన్‌గా ఉన్న ఈ భూమిని పబ్లిక్ & సెమీ పబ్లిక్ జోన్‌గా మార్చేందుకు అనుమతి ఇచ్చింది. గాబ్రియెల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఈ మార్పును ఖరారు చేసింది.
ASF: BJP రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా సిర్పూర్ MLA డాక్టర్ హరీశ్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీశ్ బాబుకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ అధిష్ఠానం స్థానిక నాయకత్వానికి పెద్దపీట వేసినట్లు భావిస్తున్నారు.
IPL ట్రేడ్ డీల్‌లో భాగంగా రవీంద్ర జడేజా CSK నుంచి RRకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ.. ’12-13 ఏళ్లపాటు ఆడిన టీమ్ నుంచి వెళ్లడం కష్టమే అయినా కెరీర్‌లో ఇవన్నీ భాగమే. కానీ నా తొలి IPL కప్(2008) గెలిచిన జట్టుకే తిరిగి వెళ్లడం సంతోషం’ అని జడ్డూ తెలిపాడు. కాగా నిన్నటి మ్యాచ్‌లో CSK కీలక బ్యాటర్లు సర్ఫరాజ్, దూబేను జడేజా పెవిలియన్ బాట పట్టించాడు.
ASR: ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. పాడేరు కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు
MNCL: లక్షెట్టిపేట పరిధిలోని వివిధ మండలాల్లో కురిసిన అకాల వర్షాలకు మామిడి, నిమ్మ తోటల రైతులు నష్టపోయారు. సోమవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు ఉరుములు, మెరుపులు భారీ ఈదురుగాలులతో గంటకు పైగా వర్షం నమోదయింది. దీంతో తాలూకా పరిధిలోని లక్షెటిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఉన్న మామిడి తోటలోని మామిడికాయలు నేల రాలాయి. నిమ్మ తోటలు ఈదురు గాలులకు పడిపవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
WGL: మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని 14వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కుంభం శివ పటేల్ అన్నారు. గతంలో ప్రజలను మోసం చేసిన వారు ఇప్పుడు కావాలనే విమర్శలు చేయడం విడ్డూరమని, అనునిత్యం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాగరాజుపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని శివ పటేల్ హెచ్చరించారు.
ADB: తాంసి, భీంపూర్ మండల పరిధిలో నేడు శనగ కొనుగోలు నిలిపివేస్తున్నట్లు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ సెంటర్ ఇంఛార్జ్ కేశవ్ మంగళవారం తెలియజేశారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు నిలిపివేయడం జరిగిందన్నారు. తర్వాత కొనుగోలు తేదీని ఒకరోజు ముందుగానే వెల్లడిస్తామని తెలియజేశారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
ADB: తాంసి, భీంపూర్ మండల పరిధిలో నేడు శనగ కొనుగోలు నిలిపివేస్తున్నట్లు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ సెంటర్ ఇంఛార్జ్ కేశవ్ మంగళవారం తెలియజేశారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు నిలిపివేయడం జరిగిందన్నారు. తర్వాత కొనుగోలు తేదీని ఒకరోజు ముందుగానే వెల్లడిస్తామని తెలియజేశారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రాష్ట్ర కమిటీ నియమించింది. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్ఠానానికి బాలరాజు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న మూవీ ‘రామాయణ’. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ మూవీ గ్లింప్స్ విడుదల కానుంది. తాజాగా లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో ఈ వీడియోను ప్రదర్శించగా, అక్కడి ప్రేక్షకులు దీని విజువల్స్ చూసి మంత్రముగ్ధులయ్యారు. హాలీవుడ్ స్థాయిలో ఉన్న గ్రాఫిక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.
BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో 8వ వార్డ్ అంగడి బజార్‌లో 100kv ట్రాన్స్‌ఫార్మర్‌ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పన్నాల శ్రీ విద్య శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, వెంకన్న Ae ప్రభాకర్, AD బాలు పాల్గొన్నారు.
TG: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి నేరుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట పడనుంది.