మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన P-4 కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా DCMS ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డికి బంగారు కుటుంబం ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కాశిరెడ్డి సమాజ సేవలో చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఎంతో కీలకమైనదన్నారు.
NGKL: మంతటి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లమ్మ-మల్లయ్య పండుగ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
E.G: సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక, ములకల్లంక, కాటవరం తదితర గ్రామాల్లో గోదావరి నదీ తీరం కోతకు గురవుతోంది. వందలాది ఎకరాల పంట భూములు నదిలో కలిసిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరదల సమయంలో నష్టం మరింత పెరుగుతుందని, తక్షణమే రివిట్మెంట్ పనులు చేపట్టి తమ భూములను కాపాడాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ATP: అనంతపురం వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు (ఏడీఏ) జీఎం అల్తాఫ్ ఖాన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఆదిమూర్తినగర్‌లోని కార్యాలయాన్ని కక్కలపల్లికి మార్చినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై జేసీ విష్ణుచరణ్ నివేదిక పంపడంతో ప్రభుత్వం స్పందించింది.
ADB: ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుక నేడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ జాబ్ మేళా ఉంటుందని తెలిపారు. ఎంపికైనా వారికీ నెలకు రూ.18-20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20సం.ల నుంచి 28 సం.లలోపు ఉండాలని ఓ ప్రకటనలో వెల్లడించారు.
VSP: ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని జిల్లా వృత్తివిద్యశాఖాధికారిణి పి.ఉమారాణి తెలిపారు. విద్యార్థులు తరగతులకు సకాలంలో హాజరవ్వాలని, తల్లిదండ్రులు పిల్లలను తరగతులకు పంపాలని కోరారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొవ్వూరి అప్పిరెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం రాత్రి వరకు సాగిన కౌంటింగ్, రీ కౌంటింగ్ ప్రక్రియల మధ్య ఎంతో ఉద్రిక్తతతో జరిగాయి. ఎట్టకేలకు ఎన్నికల అధికారులు అప్పిరెడ్డి విజయాన్ని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల తలపించేలా ఎంతో ఆర్భాటంగా ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(NH-65)పై టోల్ ఫీజును స్వల్పంగా తగ్గించారు. వివిధ రకాల వాహనాలకు రూ.5 చొప్పున టోల్ ఫీజు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తగ్గిన టోల్ ఫీజులు ఏప్రిల్ 1 (మంగళవారం అర్ధరాత్రి దాటాక) నుంచి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు రూ.5 చొప్పున టోల్ ఫీజు తగ్గించారు.
MBNR: గండీడ్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి రానున్నట్లు కాంగ్రెస్ నేత జితేందర్ రెడ్డి తెలిపారు. గండీడ్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, హైస్కూల్లో రూ.40 లక్షల నిధులతో నిర్మించిన అదనపు గదులు, సైన్స్ ల్యాబ్, జానంపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు, పెద్దవార్వాల్ బస్సు షెల్టర్లను ఆయన ప్రారంభించనున్నారు.
CTR: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖకు సోమవారం రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. ఒక్కరోజే 1,458 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగగా వాటి ద్వారా రూ.3.25 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
TPT: జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో రైతులు విద్యుత్ జాప్యంపై ఫిర్యాదు చేశారు. అధికారులు రైతులకు నేరుగా సమాచారం ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వాట్సాప్ 1800 425 155333కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
W.G: జిల్లా మత్స్యశాఖ అధికారిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విజయవాడ నుంచి బదిలీపై జిల్లాకు వచ్చారు. కలెక్టర్ నాగరాణిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అస్సర రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
VKB: అనుమతులు లేకుండా ఎర్రరాయిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రశాంత వర్ధన్ హెచ్చరించారు. నిన్న మండల పరిధిలోని రాంసింగ్ తండా శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
AP: విజయవాడలో కలకలం రేపిన ఉగ్రలింకుల కేసులో కొత్తపేట పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పట్టుబడిన నిందితులను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీజేఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జిల్లా కోర్టు ఇవాళ విచారణ చేపట్టి, తుది నిర్ణయం వెల్లడించనుంది.
MHBD: గూడూరు నూతన సీఐగా వినయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. గూడూరు పరిధిలో శాంతిభద్రతలను కాపాడడంలో చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చట్టం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.