• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బీజేపీ శిక్షణ తరగతులు నిర్వహణ

WNP: వీపనగండ్ల, పానగల్ మండలాల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, వికారాబాద్ ఇన్‌ఛార్జ్ సుధాకర్ రావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

March 31, 2026 / 09:08 AM IST

‘ధురంధర్ 2’ టెక్నికల్ వండర్‌పై వర్మ రివ్యూ

‘ధురంధర్-2’లో శివ్ కుమార్ ఎడిటింగ్, శాశ్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయని RGV అన్నాడు. ముఖ్యంగా రెట్రో హిందీ పాటలను యాక్షన్ సీన్స్‌లో వాడటం సినిమాకు కొత్త మూడ్ ఇచ్చిందని చెప్పాడు. సైనీ జోహ్రే ప్రొడక్షన్ డిజైన్ పాకిస్తాన్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిందని, సౌండ్ డిజైన్‌లో వాడిన ‘నిశ్శబ్దం’ ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టిందన్నాడు.

March 31, 2026 / 09:08 AM IST

అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం!

VKB: కుల్కచర్లలో సంవత్సరాలుగా ఆగిపోయిన రోడ్డు పనులను తూతూమంత్రంగా నిర్వహించారు. కానీ, రోడ్డు మధ్యలో సిమెంట్ డివైడర్లలో ఎర్రమట్టి వేయాలని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల అలసత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యాంగ వ్యవహరించడం వల్లనే ఇలా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

March 31, 2026 / 09:07 AM IST

సత్యవేడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహేశ్ ఏకగ్రీవం

TPT: సత్యవేడు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సోమవారం ఏకగ్రీవంగా ఎంపికయింది. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బీ. మహేష్, కార్యదర్శిగా బీ.రాజా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. పదవిలో ఉన్నంతవరకు అసోసియేషన్ అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి మంచి సేవలు అందిస్తామన్నారు.

March 31, 2026 / 09:07 AM IST

BIG ALERT: మూడు రోజులే ఛాన్స్

కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ బాలవాటిక, 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్లకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 11:59 గంటలకు గడువు ముగుస్తుంది. ఇప్పటి వరకు అప్లై చేయని వారు చేసుకోవాలి. బాలవాటికల్లో ప్రీ-ప్రైమరీ, 6 ఏళ్లు నిండిన పిల్లలకు 1వ తరగతుల్లో అడ్మిషన్లు కేటాయిస్తారు.

March 31, 2026 / 09:07 AM IST

‘ఆయ్’ డైరెక్టర్‌తో నితిన్ తదుపరి మూవీ

హీరో నితిన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వి.ఐ. ఆనంద్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీ, నాగవంశీ నిర్మాణంలో ఒక చిత్రం లైనప్‌లో ఉండగా.. తాజాగా ‘ఆయ్’ దర్శకుడు అంజి కె. మణిపుత్రతో తన తదుపరి సినిమాను ప్రకటించాడు. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినా, షూటింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

March 31, 2026 / 09:05 AM IST

ఏప్రిల్ 2న కాణిపాకంలో సామూహిక సత్యనారాయణ వ్రతం

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయంలో ఏప్రిల్ 2న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలిపారు. పౌర్ణమి సందర్భంగా ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వ్రతం కొనసాగుతుందన్నారు. వ్రతంలో పాల్గొనే భక్తులకు టికెట్టు రూ. 300 గా నిర్ణయించామన్నారు.

March 31, 2026 / 09:04 AM IST

అనుమతి లేకుండా డీజే పెడితే చర్యలు తప్పవు: ACP

MDCL: ఎక్కడైనా అనుమతి లేకుండా డీజేలు పెడుతున్నారా..? వెంటనే ఫిర్యాదు చేయాలని మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి సూచించారు. కాలనీలు, వీధుల్లో భారీ శబ్దంతో డీజేలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీస్ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 31, 2026 / 09:02 AM IST

సీసీపై బాధితుల ఫిర్యాదు

NRML: జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీసీ ముంతాజ్‌పై బాధితులు మొఖీమ్ అహ్మద్, సాదిక్ బేగ్ ఫిర్యాదు చేశారు. సారంగాపూర్ మండలంలో ఆర్‌ఐగా పనిచేసిన సమయంలో కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో తమను అనవసరంగా కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

March 31, 2026 / 09:01 AM IST

‘బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులపై కేసు నమోదు’

ADB: ఇచ్చోడ మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బండారి రాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 3 మోటార్ సైకిల్లు, 9 మొబైల్ ఫోన్లు, రూ.4470 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని CI రాజు హెచ్చరించారు.

March 31, 2026 / 09:00 AM IST

‘గురుకుల పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం’

NLR: గురుకులాల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్ జి. మురళీకృష్ణ మంగళవారం తెలిపారు. నెల్లూరు చిలమానుచేను పాఠశాలలో 5వ తరగతితో పాటు 6,7,8 తరగతులలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

March 31, 2026 / 09:00 AM IST

ఉమ్మడి గుంటూరు మండిపోతోంది..!

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమవారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల వివరాల ఇలా ఉన్నాయి. అత్యధికంగా రెంటచింతలలో 39 డిగ్రీల గరిష్ఠ, 23 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 38, కనిష్ఠంగా 23 డిగ్రీలుగా రికార్డైంది. నరసరావుపేటలో 38-22, తెనాలిలో 36-23 డిగ్రీలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

March 31, 2026 / 09:00 AM IST

డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ భార్యకు ఊరట

KKD: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు తూ.గో జిల్లా కోర్టులో ఊరట లభించింది. ఆమెపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జస్టిస్ గంధం సునీత రద్దు చేశారు. అయితే, ఆమె పాస్ పోర్టును అధికారులు స్వాధీనం చేసుకోవాలని, 15 రోజులకోసారి PSలో హాజరుకావాలని షరతులు విధించారు. వారెంట్ రద్దుపై బాధితుల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

March 31, 2026 / 09:00 AM IST

అమలాపురంలో గంజాయితో వ్యక్తి అరెస్ట్

కోనసీమ: అమలాపురం దుడ్డివారి అగ్రహారానికి చెందిన బొంతు నవీనకుమార్(23)ను రెండు కేజీల గంజాయితో పట్టుకున్నట్లు సోమవారం రాత్రి పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… గతంలో నేర చరిత్ర ఉన్న నవీన్ గంజాయి అమ్ముతున్నాడనే సమా చారంతో దాడిచేసి పట్టుకున్నామని వెల్లడించారు. గతంలో అతడిపై ఎనిమిది కేసులు ఉన్నాయన్నారు.

March 31, 2026 / 09:00 AM IST

‘అరైవ్- అలైవ్’పై ట్రాఫిక్ పోలీసుల అవగాహన

KNR: కరీంనగర్ వన్ టౌన్ స్టేషన్ ఎదుట కేడీసీసీ బ్యాంకు వద్ద ట్రాఫిక్ పోలీసులు“అరైవ్-అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్సైలు ప్రసాద్, సురేష్, చిన్న నాయక్ అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో, టాక్సీ డ్రైవర్లు, తదితరులు ఉన్నారు.

March 31, 2026 / 09:00 AM IST