• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుగ్గమ్మ గుడిలో సిబ్బంది చేతివాటం చూపించారు. హుండీ లెక్కింపులో బంగారాన్ని దారిమళ్లించేందుకు యత్నించారు. రోల్డ్ గోల్డ్ పెట్టి అసలైన బంగారం దోచేయబోయారు. అనుమానంతో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చేయించిన తనిఖీల్లో సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోగా.. EO శీనా నాయక్ సమగ్ర విచారణకు ఆదేశించారు.

March 31, 2026 / 07:42 AM IST

పాము కాటుకి గురై వ్యక్తి మృతి

ELR: కొయ్యలగూడెం మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన పారేపల్లి సురేష్ (36) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందాడు. తమ పొలంలో నిమ్మకాయలు ఏరుతుండగా పాము కాటు వేసినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెంటనే కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించగా చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

March 31, 2026 / 07:42 AM IST

నేడు పామిడిలో సుంకం వసూలుకు బహిరంగ వేలం

ATP: పామిడి పంచాయతీ పరిధిలో ఏడాదిపాటు సుంకం వసూళ్ల పనులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఈఓఆర్డీ అశ్వర్ధనాయుడు తెలిపారు. దినసరి మార్కెట్, బస్టాండ్, జంతు వధశాల, తాటిఫలసాయం సుంకపు వసూళ్లకు వేలం ఉంటుందన్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేయాలన్నారు.

March 31, 2026 / 07:41 AM IST

నేడు నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు 2026-27 బడ్జెట్ అంచనాల ప్రతిపాదనల అమోదానికి సర్వసభ్య సమావేశం జరగనుంది అని అధికారులు తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఆధ్వర్యంలో జరగనుందని పేర్కొన్నారు. నూతనంగా మేయర్‌గా నియమితులైన సుజాతకు ఇది తొలి సమావేశం కావడం విశేషం అని పలువురు అన్నారు.

March 31, 2026 / 07:40 AM IST

సచివాలయ ఉద్యోగికి ఉత్తమ అవార్డు

PPM: పీ-4 అమలులో ఉత్తమ ప్రతిభ కనపరచిన జీకే వీధి మండలం ధారకొండ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కురుజు ప్రసాద్ ఉత్తమ అవార్డు అందుకున్నారు. సోమవారం పాడేరులో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. తన ట్రస్ట్ ద్వారా ఆయన పలువురు పేదలకు పలు సేవలు అందించారు.

March 31, 2026 / 07:40 AM IST

అధ్వానంగా అర్పపల్లి – కొమ్మాల ప్రధాన రహదారి

SRPT: మూడు మండలాలను కలిపే ప్రధాన వారధి అయిన అర్పపల్లి- కొమ్మాల బీటీ రోడ్డు ప్రస్తుతం అధ్వాన స్థితికి చేరుకుంది. అర్పపల్లి, కాసర్లపహాడ్ సమీపంలో రహదారిపై బీటీ పొర పూర్తిగా లేచిపోయి, కంకర తేలి భారీ గుంతలు ఏర్పడ్డాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన బీటీ పునరుద్ధరణ పనులు చేపట్టి, తమ ప్రయాణ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

March 31, 2026 / 07:39 AM IST

మాజీ సీఎం భవనాన్ని సీజ్ చేసిన GHMC

TG: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని భవనాన్ని GHMC అధికారులు సీజ్ చేశారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఆస్తి వద్ద అధికారులు నోటీసులు అంటించి భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పన్ను వసూళ్లలో భాగంగా బకాయిదారులపై GHMC కొరడా ఝుళిపిస్తోంది.

March 31, 2026 / 07:39 AM IST

మద్యం మత్తులో భార్యపై భర్త దాడి.. కేసు నమోదు

W.G: మద్యం మత్తులో భార్యను వేధిస్తున్న భర్తపై పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కె.గంగాధర్ వివరాలు.. సిద్ధాంతం గ్రామానికి చెందిన కర్రి అన్నపూర్ణ(29)ను ఆమె భర్త పల్లపరాజు గత 3నెలలుగా వేధిస్తున్నాడు. సోమవారం మద్యం సేవించి భార్యతో పాటు ఆమె బంధువులపై కూడా దాడికి పాల్పడటంతో విసుగుచెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

March 31, 2026 / 07:35 AM IST

గుండారం పాఠశాలలో క్విజ్ పోటీలు

SDPT: బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సోమవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్య క్రమానికి బెజ్జంకి బాయ్స్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులు శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ఇటువంటి పోటీలు విద్యార్థుల మేధస్సును పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన కొనియాడారు.

March 31, 2026 / 07:35 AM IST

శ్రీశైలంలో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి

AP: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. రిజర్వాయర్‌లో 44 TMCల నీరు ఉండటంతో ఇరు రాష్ట్రాలు విద్యుదుత్పత్తిని నిలిపివేశాయి. 10 నెలల్లో కుడి గట్టులో ఏపీ 2060 మి. యూనిట్లు, ఎడమ గట్టులో TG 2,725 మి. యూనిట్ల విద్యుదుత్పత్తి చేశాయి. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు ఈ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలో 2007-08లో 2,544 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది.

March 31, 2026 / 07:35 AM IST

మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు

MNCL: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 4వ తేదీన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికపై మరోసారి ఉత్కంఠ చోటుచేసుకుంది.

March 31, 2026 / 07:34 AM IST

నేత్ర ఆసుత్రిలో కొండచిలువ కలకలం

WGL: వరంగల్ నగరంలోని ప్రాంతీయ నేత్ర వైద్య ఆస్పత్రిలో సోమవారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. ఆటోనగర్ వైపు నుంచి మెయిన్ గేట్ ద్వారా లోపలికి వచ్చిన సుమారు ఐదు అడుగుల కొండచిలువ కనిపించడంతో వైద్యులు, సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవలే ఈ నెల 23న చిన్న పాము కనిపించిన ఘటనతో పాటు మళ్లీ ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

March 31, 2026 / 07:33 AM IST

మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని డిమాండ్

SRD: జహీరాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలపై కౌన్సిలర్ అప్పం శ్రావణ్ కుమార్ గళమెత్తారు. పట్టణంలో కార్మికుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్లో ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

March 31, 2026 / 07:33 AM IST

నేడు చల్లబసాయపల్లెకు ఎంపీ రాక

KDP: దువ్వూరు మండలంలోని చల్లబసాయపల్లెలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రం,హెల్త్ క్లినిక్‌ను ఇవాళ ఉదయం 8 గంటలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించనున్నట్లు MPP కానాల జయచంద్రారెడ్డి సోమవారం తెలిపారు. MPతోపాటు మైదుకూరు మాజీ MLA శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మాజీ DY CM అంజాద్ బాషా, YCP జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొంటారన్నారు.

March 31, 2026 / 07:33 AM IST

నేడు శ్రీకాకుళంలో జాబ్ మేళా

SKLM: శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు .సాయి కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు.15 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 500 పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 31, 2026 / 07:33 AM IST