AP: రాజీనామా చేసిన YCP MLCలకు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈనెల 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌కు నోటీసులు పంపించారు. మరోవైపు ఈనెల 25న విచారణకు రావాలని జయమంగళం వెంకట రమణకు సూచించారు.
VSP: భారత నౌకాదళాధిపతి దినేష్ కే. త్రిపాఠి సింగపూర్ నౌకాదళాధిపతి షాన్ వాట్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల నౌకాదళాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ముఖ్యంగా ‘సింబెక్స్ విన్యాసాలు, అలాగే ‘ఎక్సర్‌సైజ్ పసిఫిక్ రీచ్ 2025’లో సబ్‌మరైన్ శోధన–రక్షణ సహకారంపై దృష్టి సారించారు.
MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకుబ్ ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. జీరాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ. 600 పెంచాలని కోరారు.
BDK: ఐటీడీఏ పీవో రాహుల్‌ను, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశీ హుస్సేన్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల యూపీలో జరిగిన ఫెడరేషన్ కప్ రెస్లింగ్ పోటీల్లో వెంకటప్రసాద్ 97 కేజీల విభాగంలో నవీన్ 100 కేజీల విభాగంలో సత్తా చాటారు. బెస్ట్ ర్యాంకుల్లో నిలిచి ఖేలో ఇండియా జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు.
NGKL: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఊర్కొండ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్ నాయక్ అన్నారు. గుండ్లగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. నాణ్యమైన ఆహారం ద్వారా మాతాశిశు మరణాలను అరికట్టడమే ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజని, ఉపసర్పంచ్ కొండల్ పాల్గొన్నారు.
ప్రకాశం: కంభంలో ఇవాళ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పురుగు మందుల షాపు లైసెన్స్ మంజూరు కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కంభం మండల వ్యవసాయాధికారి షేక్ మహమ్మద్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ దాడులను అధికారులు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
PLD: ఆర్టీఈ (RTE) చట్టం కింద 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు నూజెండ్ల ఎంఈవో రవిచంద్ర శుక్రవారం తెలిపారు. అర్హులైన పేద విద్యార్థులు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
HYD: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగిన సమీక్షలోని నిర్ణయాలపై కంటోన్మెంట్ MLA శ్రీగణేశ్ అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
KNR: మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఆడపిల్లల వివాహానికి రూ. 10,116 ఇస్తానని హుజరాబాద్ 21వ వార్డు కౌన్సిలర్ పంజాల రాజ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఎన్నికలో ఆయన గెలవడంతో ఇచ్చిన హామీ మేరకు వార్డుకి చెందిన పోగు తేజస్వినికి వివాహం నిశ్చయం కాగా ఇవాళ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్‌ను అభినందించారు .
AP: కేంద్రం తెచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్ల అమలుపై రాష్ట్ర కార్మికశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సంస్కరణలపై స్టేక్ హోల్డర్ల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. చట్టాల సరళీకరణ, ఆధునీకరణ ద్వారా కార్మికుల హక్కులను రక్షిస్తూనే.. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. మార్చి 15లోగా ఈ సూచనలు అందజేయాలని ప్రభుత్వం కోరింది.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం, ఏన్కూర్ మండలం హిమామ్ నగర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NRML: ఆర్టీసీ సమస్యల పరిష్కారం, ప్రభుత్వంలో విలీనం తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఆర్.రెడ్డి శుక్రవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. వేతన సవరణ అమలు, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ వంటి ప్రధాన డిమాండ్లపై అన్ని డిపోల ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ విషయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాకా పేరు ప్రతిష్టను అభాసుపాలు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, మనవడు ఎంపీ వంశీకృష్ణ దౌర్జన్యాలు అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని అన్నారు. మంత్రులపై కావాలనే BJP నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై CBI విచారణ చేయించాలని అడిగినా.. కిషన్ రెడ్డి స్పందించడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసైనా బండి సంజయ్ బద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పలు ప్రారంభోత్సవాలు, భూమి పూజలను నిర్మల్ డసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఉట్నూర్‌లోని కన్నాపూర్, గంగాపూర్, పాత ఉట్నూర్‌లలో రూ.10 లక్షలతో వివో బిల్డింగ్స్‌కు భూమి పూజ చేశామన్నారు. అలాగే రూ. 20 లక్షలతో జీపీ భవనాలు ప్రారంభం అయ్యాయన్నారు.