• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కొత్త కలెక్టర్‌ బాధ్యతల స్వీకారం రేపు

VSP: జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఎం.అభిషిక్త్ కిషోర్‌ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన మంగళవారం రాత్రికి నగరానికి చేరుకుని పోర్టు అతిథి గృహంలో బస చేయనున్నారు. ప్రస్తుత కలెక్టర్‌ ఎంఎన్‌. హరేంధిరప్రసాద్‌ బుధవారం నూతన కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు.

March 31, 2026 / 06:05 AM IST

పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

KMR: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులకు సంబంధించి విచారణ త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సోమవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, పాలుగోన్నారు.

March 31, 2026 / 06:01 AM IST

బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై కేతిరెడ్డి సమావేశం

ATP: తాడిపత్రిలోని YCP కార్యాలయంలో బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమావేశం నిర్వహించారు. తాడిపత్రి పట్టణం, రూరల్ మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ కమిటీల పాత్ర కీలకమని, సమర్థులైన వారిని ఏజెంట్లుగా నియమించాలని సూచించారు.

March 31, 2026 / 06:00 AM IST

పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు పెంపు

NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యను అభ్యసిస్తున్న 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ (2021 నుంచి 2025 వరకు) విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు గడువును పెంచినట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు, అపరాధ రుసుం రూ. 100తో ఏప్రిల్ 6 వరకు అవకాశముందన్నారు.

March 31, 2026 / 06:00 AM IST

నేడు కమలాపురంలో రైల్వే వంతెన పనులు ప్రారంభం

KDP: కమలాపురంలో రూ.65 కోట్లతో రైల్వే వంతెన పనులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ప్రారంభించనున్నట్లు టీడీపీ జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులు, నాయకులు, తదితరులు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.

March 31, 2026 / 05:56 AM IST

నరసాపురంలో ఆశీలు వేలంపాట ఖరారు

W.G: నరసాపురం టౌన్ వీధి వ్యాపారుల నుంచి పన్ను వసూలు చేసుకునే ఆశీలు వేలం పాట ఖరారైందని పురపాలక కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన భూపతి సురేష్ అత్యధికంగా రూ.50.40లక్షల హెచ్చుపాటకు పాడి పన్ను వసూలు హక్కు సొంతం చేసుకున్నారు. పశువధ శాలల పన్ను వసూలుకు ముస్కుడి సాల్మన్ రూ.15,500లు హెచ్చు పాటకు పాడినట్లు తెలిపారు.

March 31, 2026 / 05:52 AM IST

మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ: SP

ADB: మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యమని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం బోథ్ మండల కేంద్రంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాహన నియమ నిబంధనలు పాటించాలని SP సూచించారు.

March 31, 2026 / 05:48 AM IST

కొండగట్టుకు హనుమాన్ మాలధారుల పాదయాత్ర

MDK: చేగుంట మండలంలోని గోపాలపురం గ్రామం నుంచి కొండగట్టు అంజన్న క్షేత్రం వరకు సోమవారం పాదయాత్ర ప్రారంభమైంది. హనుమాన్ జయంతిలోపు స్వామివారిని దర్శించుకోవాలనే సంకల్పంతో మాజీ వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం నేతృత్వంలో 16 మంది మాలధారులు ఈ యాత్ర చేపట్టారు. భక్తిశ్రద్ధలతో కొండగట్టు చేరుకుని మొక్కులు తీర్చుకుంటామని వారు తెలిపారు. బయలుదేరిన మాలధారులకు వీడ్కోలు పలికారు.

March 31, 2026 / 05:48 AM IST

ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి: ఎస్పీ

సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ 62 అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.

March 31, 2026 / 05:46 AM IST

కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానం

NRPT: నారాయణపేట పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కమిషనర్ గోల్కొండ నరసయ్య తెలిపారు. ఓటరు జాబితాలో పేరు, 21 ఏళ్ల వయస్సు వంటి అర్హతలు తప్పనిసరని చెప్పారు. మైనారిటీ వర్గాలకు ప్రత్యేక స్థానాలు ఉండగా, ఒక మహిళకు ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గలవారు తగిన పత్రాలతో ఏప్రిల్ 6లోపు మున్సిపల్ ఆఫీస్‌లో  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 31, 2026 / 05:45 AM IST

నేడు మంథనిలో PACS సర్వసభ్య సమావేశం

PDPL: మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు సంఘ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో జమఖర్చులు, సోలార్ ప్లాంట్ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. సభ్యులు, రైతులు, అధికారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

March 31, 2026 / 05:40 AM IST

ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే భద్రత: సీఐ మురళి

SDPT: వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను నిబంధనల ప్రకారం పాటించాలని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి సూచించారు. సోమవారం గౌరారంలోని కావేరి యూనివర్సిటీలో విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు.

March 31, 2026 / 05:38 AM IST

రేపు పిఠాపురంలో ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ జట్ల ఎంపిక

KKD: పిఠాపురం ఆర్ఆర్బీహెన్ఆర్ క్రీడా మైదానంలో రేపు ఉమ్మడి తూ.గో. జిల్లా స్థాయి పురుషుల, మహిళల రగ్బీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ నిర్వహక కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడిస్తూ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వివరాలతో హాజరు కావాలన్నారు.

March 31, 2026 / 05:36 AM IST

‘ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలి’

GDWL: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు రాఘవేంద్రరావు, రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం విద్యుత్ శాఖ గద్వాల డివిజన్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. చదువు అర్హతతో ఉద్యోగాలు కేటాయించాలని, స్పాట్ బిల్లర్స్‌కు జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

March 31, 2026 / 05:31 AM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సిన్

SRD: రామచంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం HPV వ్యాక్సిన్‌ను 18 మంది బాలికలకు వేశారు. వ్యాక్సిన్ వేసిన గంట సేపటి వరకు ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ డా. కల్పన పర్యవేక్షణలో ఉంచారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నియంత్రిస్తుందని డాక్టరు చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది అర్చన, మేఘన, తదితరులు పాల్గొన్నారు.

March 31, 2026 / 05:31 AM IST