SRD: రామచంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం HPV వ్యాక్సిన్‌ను 18 మంది బాలికలకు వేశారు. వ్యాక్సిన్ వేసిన గంట సేపటి వరకు ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ డా. కల్పన పర్యవేక్షణలో ఉంచారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నియంత్రిస్తుందని డాక్టరు చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది అర్చన, మేఘన, తదితరులు పాల్గొన్నారు.